ఎపి స్పీకర్​ తమ్మినేనికి కరోనా

By udayam on May 4th / 5:32 am IST

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్​ తమ్మినేని సీతారాంకు కరోనా పాజిటివ్​గా రిపోర్ట్​ వచ్చింది. తమ్మినేనితో పాటు ఆయన భార్య వాణిశ్రీ కి సైతం పాజిటివ్​గా తేలింది. దీంతో వారిద్దరినీ శ్రీకాకుళంలోని మెడికవర్​ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరోనాతో ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి సీరియస్​గానే ఉందన్న డాక్టర్లు ట్రీట్​మెంట్​ జరుగుతోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​లో నిన్న ఒక్కరోజే 18 వేలకు పైగా కరోనా పాజిటివ్​ కేసులు వచ్చాయి.

ట్యాగ్స్​