కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సామాజిక ప్రగతి సూచిక (ఎస్‌పిఐ) ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చిత్తూరు నిలవగా.. కర్నూలు అన్నింటికంటే చివరి స్థానానికి పడిపోయింది. అయితే, ఐదు విభాగాలుగా రూపొందించిన ఈ నివేదికలో అత్యధిక ప్రగతి సాధించిన కేటగిరిలో తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జిల్లా కూడా లేదు. అధిక సామాజిక పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రెండేసి జిల్లాలు ఉన్నాయి. అప్పర్ మిడిల్ విభాగంలో ఏపి, తెలంగాణకు చెందిన ఏడు జిల్లాలు, లోయర్ మిడిల్ కేటగిరిలో తెలంగాణ నుండి 15, ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు జిల్లాలు ఉన్నాయి.