ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. దీంతో ఆయన ఈ పదవిలో ఈ ఏడాది నవంబర్ 30 వరకూ కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. గతేడాది అక్టోబర్ లో అప్పటి సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ నుంచి బాధ్యతలు తీసుకున్న ఆయన గతేడాది నవంబర్ 30నే పదవీ విరమణ చేయాల్సి ఉంది.