మరో 14 వేల మె.వాట్ల ప్రాజెక్ట్​ పట్టేసిన ఎపి

By udayam on May 25th / 10:30 am IST

దావోస్​లో ఎపి తన పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. సిఎం జగన్​ మోహన్​ రెడ్డి స్వయంగా అక్కడే ఉంటూ పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులను తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా అరబిందో రియల్టీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఎపిలో 6 వేల మె.వాట్ల గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తికి ముందుకొచ్చింది. దీంతో పాటు గ్రీన్​ కో సంస్థ సైతం ఎపిలో 8 వేల మె.వాట్ల కర్బన రహిత ఉత్పత్తికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిపి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

ట్యాగ్స్​