సిఎం జగన్​ బంధువు అరెస్ట్​

By udayam on May 10th / 5:39 am IST

ఎపి సిఎం జగన్​మోహన్​ రెడ్డి బంధువు, వైకాపా నేత వైఎస్​.కొండారెడ్డిని కడప పోలీసులు అరెస్ట్​ చేశారు. కన్​స్ట్రక్షన్​ కంపెనీల నుంచి లంచం డిమాండ్​ చేస్తూ.. ఇవ్వని వారిపై బెదిరింపులకు దిగాడన్న ఆరోపణలపై అతడు అరెస్ట్​ అయ్యాడు. కొండా రెడ్డి చక్రాయపేట మండల వైసీపీ ఇన్​ఛార్జ్​గా వ్యవహరిస్తున్నారు. వెంపల్లి నుంచి రాయచోటి వరకూ రోడ్డు పనుల కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థ నుంచి అతడు లంచం డిమాండ్​ చేశాడని, వారు కాదనడంతో బెదిరింపులకు దిగాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​