ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో పర్యటించిన ఆయన.. తన కోసం నిరీక్షిస్తున్న ఓ చిన్నారిని ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. చిన్నారికి ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా చికిత్స అందించాలని అక్కడే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడికక్కడే చిన్నారికి రూ. 10 వేలు పెన్షన్ మంజూరు చేశారు.