ఏపీ సర్కార్​: కందుకూరు, గుంటూరు ఘటనల ఫై జ్యుడీషియల్‌ విచారణ

By udayam on January 9th / 4:59 am IST

చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల ఫై జగన్ సర్కార్ జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశాలు జరిసింది. ఈ మేరకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కమిషన్ నియమించింది. చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, బాధ్యులను గుర్తించాలని సూచించింది. అలాగే ఏర్పాట్లలో లోపాలు గుర్తించాలని కమిషన్‌ను కోరింది. ఒకవేళ అనుమతుల ఉల్లంఘన జరిగితే దానికి కారణమైన వారిని గుర్తించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని.. ఆయా ఘటనలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్స్​