విశాఖ పెట్టుబడుల సమావేశానికి మస్క్​, బెజోస్​ లకు ఆహ్వానాలు

By udayam on January 6th / 6:19 am IST

ఆంధ్రప్రదేశ్​ తీర నగరం విశాఖ లో జరగనున్న ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ఏపీ సర్కార్​ ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్లు ఎలన్​ మస్క్​ (టెస్లా), జెఫ్​ బెజోస్​ (అమెజాన్​), టిమ్​ కుక్​ (యాపిల్​) లకు ఆహ్వానాలు పంపింది. వీరితో పాటు గూగుల్​ సీఈఓ సుందర్​ పిచయ్​, మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​ సత్య నాదెళ్ళకూ ఆహ్వానాలు వెళ్ళాయి. మార్చి 3–4 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సిఎంలు, 44 మంది ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు, భారత్​ నుంచి 53 మంది బడా వ్యాపారవేత్తలు, 15 మంది కేంద్ర మంత్రులు, వివిద దేశాలకు చెందిన రాయబారులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్​