జిఒ -1పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీల రోడ్ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జిఒ నెంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్రప్రభుత్వం జనవరి 2న జిఒ నెంబరు 1 తీసుకొచ్చిందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.