ఖరీఫ్​కు ముందుగానే నీళ్ళు!

By udayam on April 14th / 6:33 am IST

రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల, కండలేరు వాటర్​ రిజర్వాయర్లలో నీళ్ళు కళకళలాడుతున్న తరుణంలో నెల్లూరు జిల్లాలోని మొత్తం ఆయకట్టుకు ఖరీఫ్​ పంట కోసం ముందుగానే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబర్​ – డిసెంబర్​ మధ్య వచ్చిన వరదల కారణంగా ఈ రిజర్వార్లు నీటితో నిండాయి. దీంతో మొత్తం ఆరు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్​ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోమశిలలో 58 టిఎంసిలు, కడలేరులో 48 టిఎంసిల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​