అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో హౌస్ పిటిషన్ మోషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే.
అయితే నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
మంగళవారం ప్రభుత్వం వాదనలపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇంత వరకు ఎక్కడా జరగలేదని అన్నారు.
వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. అయితే టీచర్లు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.