ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిర్మూలనకు రూపొందింని ఏసీబీ 14400 మొబైల్ యాప్‌ను సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదనే ఈ యాప్‌ను తీసుకొస్తున్నామని జగన్ అన్నారు. రూ.1.41 లక్షల కోట్లను అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేస్తున్నామన్న ఆయన.. కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లో అయినా లంచం అడిగితే ఏసీబీ 14400 యాప్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన వెల్లడించారు.
అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400’ మొబైల్‌యాప్‌ను ప్రారంభించిన సీఎం. అవినీతి నిరోధానికి ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి. పట్టుబడ్డవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. pic.twitter.com/HHJAR3omPL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 1, 2022