అంబానీ ఇంటికి కడియం మొక్కలు

By udayam on November 27th / 5:13 am IST

బిలియనీర్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేష్​ అంబానీ తన జామ్​నగర్​ ఇంటి కోసం కడియం నుంచి మొక్కలను కొనుగోలు చేశారు. 170, 200 ఏళ్ళ వయసున్న రెండు ఆలివ్​ చెట్లను కడియంలోని గౌతమి నర్సరీ నుంచి ఆర్డర్​ చేసినట్లు నర్సరీ యజమాని మార్గాని శేషు ప్రకటించారు. స్పెయిన్​ నుంచి తీసుకొచ్చిన వీటిని గురువారం గుజారాత్​లోని జామ్​నగర్​లోని అంబానీ ఇంటికి ట్రక్​లో తరలించినట్లు శేషు తెలిపారు. ఏడాదిగా నర్సరీలోనే ఉన్న వీటి గురించి రిలయన్స్​ కంపెనీ తెలుసుకుని వచ్చి ఆర్డర్​ తీసుకెళ్ళాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్​