ఆఖరి దశ పంచాయితీ పోలింగ్ షురూ

By udayam on February 21st / 5:12 am IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చివరిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఆరున్నర గంటలకు ప్రారంభం కావడంతో ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.

కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తు న్నారు.ఇప్పటికే మూడ దశల ఎన్నికలు పూర్తయ్యాయి. చివరిదశతో పంచాయితీ సమరం ముగుస్తుంది.

నాలుగో దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవమయ్యారు.

రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాలేదు. మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా 9 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

161 మండలాల్లో మొత్తం 67,75,226 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

ట్యాగ్స్​