డీజీపి: అక్రమగా ఆయుధాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్​

By udayam on December 27th / 6:42 am IST

రాష్ట్రంలో అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్టు చేసినట్లు ఎపి డిజిపి రాజేంద్రనాథ్​ రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి, అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల దందాలో కీలక నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆయుధాల అక్రమ తయారీ గుట్టు వెలుగులోకి వచ్చిందన్నారు. బెంగుళూరుకు చెందిన రౌడీషీటర్లను విచారించగా మధ్యప్రదేశ్‌లో తయారీ కేంద్రం ఉన్నట్లు తేలిందని చెప్పారు.వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్​