అక్రమ మైనింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. 2021-22లో ఏపిలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి 9,351 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 3,396 వాహనాలు సీజ్ చేసినట్లు, రూ.420.91 కోట్ల జరిమానా రాష్ట్ర ప్రభుత్వం విధించిందని పేర్కొన్నారు. కోర్టుల్లో 24 కేసులు దాఖలు అయ్యాయని, 39 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని తెలిపారు.తెలంగాణలో 2,831 కేసులు నమోదు కాగా, 73 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.