విద్యార్థులకు గుడ్​ న్యూస్​: టెన్త్​ లో ఇకపై 6 పేపర్లే

By udayam on November 24th / 9:44 am IST

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. ఈమేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు.కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​