మరో 3 రోజులు ఎపిలో వర్షాలు

By udayam on January 14th / 5:12 am IST

ఆంధ్రప్రదేశ్​లో గత 2 రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు మరో 3 రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ధోరణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. విదర్భ, చత్తీస్​ఘడ్​, ఒడిశాల మీదుగా ఈ ద్రోణి వ్యాపించి ఉందన్నారు. గుంటూరు, కృష్ణ, విజయనగరం, విశాఖ జిల్లాల్లో దీని ప్రభావంతో గురువారం భారీ వర్షాలు పడ్డాయని తెలిపింది. ఎస్​కోటలో 9 సెం.మీ., పార్వతీపురంలో 8 సెం.మీ., పొన్నూరులో 6 సెం.మీ. వర్షం పడింది.

ట్యాగ్స్​