మార్చి కల్లా 100 శాతం వ్యాక్సినేషన్​ : ఎపి

By udayam on November 27th / 2:27 pm IST

ఆంధ్రప్రదేశ్​లో వచ్చే మార్చి చివరి నాటికి 100 శాతం వ్యాక్సినేషన్​ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.4 కోట్ల మందికి తొలి డోసును అందించామని, ఇందులో 2.39 కోట్ల మంది రెండు డోసులను తీసుకున్నారని సిఎం జగన్మోహన్​ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్​ చివరి కల్లా రాష్ట్రంలోని అర్హులందరికీ తొలి డోసును కంప్లీట్​ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని సిఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటి వరకూ 87 శాతం మంది ప్రజలు వ్యాక్సినేషన్​ వేయించుకున్నారని పేర్కొన్నారు.

 

ట్యాగ్స్​