పింఛన్​ ఇవ్వడానికి 300 కి.మీ. ప్రయాణం

By udayam on July 21st / 8:08 am IST

ఆంధ్రకు చెందిన ఓ గ్రామ వలంటీర్​ ఓ వృద్ధురాలికి పెన్షన్​ ఇవ్వడానికి ఏకంగా 300 కి.మీల దూరం ప్రయాణించింది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు నుంచి 24 ఏళ్ళ వాలంటీర్​ సాయి మల్లిక హైదరాబాద్​లో ఉంటున్న మండవ సరోజిని (80), రాజదేవి(77)లకు పెన్షన్​ ఇవ్వడానికి వెళ్ళింది. పెన్షన్​ ఇవ్వాలంటే ఈ–కెవైసి తప్పనిసరి కావడంతో ఆమె అంతదూరం ప్రయాణించి వారికి వృద్ధాప్య పింఛన్లను అందించింది.

ట్యాగ్స్​