ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఎపికి చెందిన టీచర్ రామ్ భూపాల్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆయనకు వచ్చిన డబ్బునంతటినీ బాలికల విద్యకు కేటాయించినందుకు గానూ మోదీ భూపాల్ రెడ్డి టీచర్‌ను అభినందించారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు గ్రామంలో ఓ స్కూలుకు ఆయన ప్రిన్సిపల్‌గా ఉండి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు వచ్చిన రూ.25.71 లక్షలను 88 మంది బాలికల విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీంలో 10 ఏళ్ళ కాలానికి ఖాతాలు తెరిచారు.