గుడివాడ ఉద్రిక్తత: టిడిపి ఆఫీసు పైకి పెట్రోల్​ ప్యాకెట్లు..

By udayam on December 26th / 8:08 am IST

గత కొద్దీ రోజులుగా ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఈ ఉద్రిక్తతలు గుడివాడకూ చేరుకున్నాయి. స్థానిక టీడీపీ కార్యాలయం పైకి దూసుకొచ్చిన దుండగులు.. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడింది మాజీ మంత్రి అనుచరులే అని స్థానికులు చెబుతున్నారు. అయితే.. టీడీపీ ఆఫీస్ పైకి విసిరిన పెట్రోల్‌ ప్యాకెట్లకు నిప్పంటుకోలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్​