స్నో కోన్​ : ఆండ్రాయిడ్​ 12కు స్వీట్​ నేమ్​

By udayam on February 17th / 10:49 am IST

ప్రతి ఏడాది గూగుల్​ తన మొబైల్​ ఆండ్రాయిడ్​ సాఫ్ట్​ వేర్​కు కొత్త సొబగులు అద్దుతూ విడుదల చేసే అప్డేట్​కు ఏదో ఒక స్వీట్​ పేరు పెడుతుందన్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఏడాది విడుదల చేయబోయే ఆండ్రాయిడ్​ 12కు సంబంధించి ‘స్నో కోన్​’ అని పేరు పెట్టబోతున్నట్లు ఆన్​లైన్​లో ప్రచారం జరుగుతోంది.

దాంతో పాటు ఆండ్రాయిడ్​ 12 ఇంటర్​ఫేస్​ ఇలా ఉండబోతుందంటూ కొన్ని ఫొటోలు సైతం లీక్​ అయ్యాయి. మరింత ఫ్లాట్​ టోన్​తో రానున్న ఈ అప్డేట్​ ద్వారా మొబైల్​ స్క్రీన్లు మరింత సున్నితమైన సాఫ్ట్ వేర్​ అనుభూతిని అందుకోబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్​
Source: gsmarena