తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రేపు (శనివారం) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీకుమార్ రాష్ట్రస్థాయిలో పోలీసు విభాగంలో పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు. రవి గుప్తాకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక, సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్ ను నియమించారు.