రాష్ట్రానికి మరో ఎక్స్​ప్రెస్​ హైవే

By udayam on May 14th / 5:35 am IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి కేంద్రం 6 లైన్ల ఎక్స్​ప్రెస్​ హైవేను అదనంగా కేటాయించింది. రాష్ట్రంలోని కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్​కు కలుపుతూ ఈ ఆరు లైన్ల హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ రోడ్డు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా 318 కి.మీ.ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్​ కోసం డిపిఆర్​ సిద్ధమవుతోంది.. భారత మాల ప్రాజెక్ట్​ రెండో దశలో భాగంగా ఈ రోడ్డును రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్​