తిరుపతి రుయాలో ఘటనను మరవక ముందే నెల్లూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సంగం చెరువులో నీట మునిగిన శ్రీరామ్ అనే 10 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తరలించడానికి 108 సిబ్బంది నిరాకరించారు. నిబంధనలు ఒప్పుకోవంటూ వారు శవాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక చిన్నారి తండ్రి తన ద్విచక్ర వాహనంపైనే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ ఘటనపై టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది.
ఆప్తుల చావును కూడా రాజకీయాలకు వాడుకునే పాలకులకు కుటుంబ అనుబంధాల గురించి తెలియకపోవడం వల్లే ఏపీలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కొడుకు మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాల్సి వచ్చిన మరో ఘటన నెల్లూరు జిల్లా సంగంలో జరిగింది. (1/2) pic.twitter.com/fMHSN4Cos4
— Telugu Desam Party (@JaiTDP) May 5, 2022