టాలీవుడ్​ సీనియర్​ నటుడు జనార్ధన్​ కన్నుమూత

By udayam on December 29th / 9:11 am IST

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణ వార్తలు మరువకముందే మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్‌ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే అపోలో ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూనే జనార్దన్‌ ఆరోగ్యం క్షీణించటంతో తుది శ్వాస విడిచారు. 300 లకు పైగా చిత్రాల్లో ఆయన పలు క్యారెక్టర్లలో నటించారు.

ట్యాగ్స్​