నాని, నజ్రియా ఫహద్లు జంటగా నటిస్తున్న ‘అంటే సుందరానికి’ ట్రైలర్ వచ్చే నెల 2న విడుదల కానున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, మేకింగ్ వీడియో, టీజర్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ‘సరదా వ్యక్తులైన సుందర్, లీల కలిసినప్పుడు వినోదం కచ్చితంగా ఉంటుంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.