ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా అల్బనీస్​

By udayam on May 23rd / 8:14 am IST

ఆస్ట్రేలియాలో కొత్త ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ముగిసిన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్​ పార్టీ 2007 తర్వాత తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అల్బనీస్​ ఆ దేశ నూతన ప్రధానిగా ఈరోజు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన వెంటనే చైనా నుంచే తమకు ఇబ్బందులు ఉన్నాయని, ఆస్ట్రేలియా ఎప్పుడూ ఒకేలా ఉందని.. చైనా మారిపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్​