6 నెలలకే తగ్గుతున్న యాంటీబాడీస్​

By udayam on September 6th / 2:11 pm IST

అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్​ తయారు చేసిన కొవిడ్​ వ్యాక్సిన్​ 2వ డోస్​ అనంతరం యాంటీబాడీస్​ 6 నెలల్లోనే తగ్గిపోతున్నట్లు సర్వేలో బయటపడింది. మొత్తం 120 మంది నర్సులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన ఈ వ్యాక్సిన్​ పరీక్షల్లో ఈ విషయబ తేలింది. 2వ డోసు తీసుకున్న వారిలో 80 శాతం యాంటీబాడీస్​ 6 నెలలకే మాయమవుతున్నట్లు తేలింది. 48 నుంచి 76 ఏళ్ళ మధ్య వయసువారిలో ఈ యాంటీబాడీల తగ్గుదల కనిపించిదని ఈ సర్వే తెలిపింది.