బృందావన్‌ ఆశ్రమంలో విరుష్క దంపతులు

By udayam on January 7th / 7:25 am IST

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ బృందావన్‌ ఆశ్రమంలో సందడి చేశారు. రెండు రోజుల బృందావన్‌ పర్యటనలో భాగంగా విరుష్క దంపతులు తమ కూతురు వామికతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ప్రేమానంద్‌ మహరాజ్‌ స్వామీజీ ప్రవచనాలను ఆలకించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. విరాట్‌ దంపతులిద్దరూ స్వామీజీ ముందు చేతులు జోడించి కూర్చోగా.. వామికను అనుష్క ఒడిలో కూర్చోబెట్టుకుంది.

ట్యాగ్స్​