పోలీసుల అదుపులో అన్యం సాయి

By udayam on May 27th / 6:54 am IST

అమలాపురం అల్లర్లలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైకాపా కార్యకర్త అన్యం సాయితో పాటు 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి విశ్వరూప్​కు అనుచరుడుగా ఉంటున్న అన్యం సాయి.. మిగతా పార్టీల ముఖ్య నేతలతోనూ మంచి సంబంధాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న కోనసీమ సాధన సమితి ఆందోళనల్లో ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుంటానంటూ అతడు చేసిన హల్​చల్​ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రౌడీ షీట్​ ఉన్న అతడిపై తాజాగా అల్లర్లకు కారణమంటూ మరో కేసు నమోదైంది.

ట్యాగ్స్​