విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం

By udayam on November 22nd / 10:39 am IST

విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సోము వీర్రాజును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి చెప్పడంతో సిబ్బంది అనుమతించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనను లోపలకు పంపించరా? అంటూ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీన్ని గమనించిన కిషన్ రెడ్డి ఆయనను లోపలకు అనుమతించమని చెప్పడంలో వీర్రాజును లోపలకు పంపించారు. దీంతో సోము శాంతించారు.

ట్యాగ్స్​