ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు పదోన్నతి లభించింది. ఆయనకు అదనపు డీజీగా పదోన్నతి కలిపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తనకు పదోన్నతి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్టును సోషల్ మీడియలో పెట్టారు.ఈయనతో పాటు కేంద్ర సర్వీసులో ఉన్న అమిత్ గార్గ్, మహేష్ దీక్షిత్ లకు కూడా డీజీలుగా ప్రమోషన్ దక్కింది. శ్యాంసుందర్, త్రివిక్రమ్ వర్మ, పాలరాజ్ లకు డీజీలుగా, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, అమ్మిరెడ్డిలకు డీఐజీలుగా ప్రమోషన్ లభించింది.