రఘురామకు సీఐడీ నోటీసులు

By udayam on January 12th / 7:00 am IST

ఎపి సిఎం వైఎస్​ జగన్మోహన్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ వైకాపా రెబల్​ ఎంపికి సిఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిఐడి ప్రత్యేక బృందం హైదరాబాద్​లోని ఎంపి ఇంటికి వెళ్ళి నోటీసులను అందించారు. రెండు రోజుల పాటు నరసాపురం వెళ్తున్నానని ఆయన ప్రకటించిన వెంటనే పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. గురువారం నాడు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ట్యాగ్స్​