కొనసాగుతున్న నారాయణపై సిఐడి విచారణ

By udayam on November 18th / 10:36 am IST

మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ కొనసాగుతోంది. పరీక్షా పత్రం లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా నారాయణ స్టేట్మెంట్ ను ఏపీ సీఐడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ఉదయం 11.30గంటలకు అధికారులు నారాయణ నివాసానికి చేరుకున్నారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపైనా అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే అధికారులు నోటీసు ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్​ లోని ఆయన ఇంట్లోనే సిఐడి ప్రశ్నిస్తోంది.

ట్యాగ్స్​