టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ కార్యాలయంలో నిన్న ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో ఉన్న ఆయన కార్యాలయానికి ఉదయం 10 గంటల సమయంలో దాదాపు 40 మంది అధికారులు చేరుకున్నారు. అనంతరం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.