శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని సిఎం వైఎస్ జగన్ ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపుగా 17,584 రెవెన్యూ గ్రామాలు ఉంటే అందులో మొదటి దశలో ఈ రోజు నుంచి మరో 15 రోజుల్లోనే 2 వేల గ్రామాల్లోని రైతులందరికీ కూడా భూ హక్కు పత్రాలను అందజేస్తున్నామన్నారు. రెండో దశ ఫిబ్రవరి 2023 మరో నాలుగు నెలల కాలంలో మరో నాలుగు వేల గ్రామాల రైతులకు వారి భూ హక్కు పత్రాలు అందిస్తమన్నారు.మే నెల నుంచి మూడో దశ, ఆగస్ట్ నుంచి 4వ దశలో కలిపి మొత్తం 15 వేల గ్రామాల రైతులకు భూ హక్కు పత్రాలు అందిస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కార్యక్రమం. 2వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి. భూ హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. 15 రోజుల్లో ఈ 2 వేల గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలు.#YSJaganMarkGovernance pic.twitter.com/9RONqrjOVS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 23, 2022