రాష్ట్రంలో క్లాష్ యుద్ధం జరుగుతోంది. పేదవాడికి, పెత్తందారీకి మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దన్నారు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కేసులు వేస్తున్నారు. పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో యుద్ధం చేస్తున్నా..నేను ప్రజలనే నమ్ముకున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో జరిగిన పింఛన్ వారోత్సవాల్లో పాల్గొన్న సిఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేదన్న ఆయన.. ఇప్పుడు 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబును నమ్మితే పేదవాడు నాశనమైపోతాడు. #YSRPensionKanuka#NaraHanthakuduCBN pic.twitter.com/xEcB8N8oXm
— YSR Congress Party (@YSRCParty) January 3, 2023