ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 11 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం యూరప్ చేరుకున్నారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 22–26 తేదీల మధ్య జరగనున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్‌లో పాల్గొననున్న ఆయన అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సిఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జి.అమర్నాథ్లు సైతం ఉన్నారు. దావోస్ సదస్సులో ఎపి తన పెవిలియన్‌ను సైతం ఏర్పాటు చేసింది.