ఢిల్లీ పర్యటనకు సిఎం జగన్​

By udayam on June 2nd / 7:02 am IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వేగంగా విడుదల చేయమని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు సీఎం జగన్‌.

ట్యాగ్స్​