గడప గడపకూ సమీక్షలో ఎమ్మెల్యేలపై సిఎం ఆగ్రహం

By udayam on December 16th / 11:19 am IST

ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. గడపగడపకు ప్రభుత్వంలో వెనుకబడ్డ 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మార్చిలోగా పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆదేశించారు. పనితీరు మార్చుకోకుంటే కొత్త అభ్యర్థులను పెడతానని ఎమ్మెల్యేలను సీఎం జగన్ హెచ్చరించినట్లు సమాచారం.

ట్యాగ్స్​