దుర్గమ్మ సేవలో సిఎం జగన్​

By udayam on October 12th / 11:19 am IST

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా మంగళవారం నాడు ఎపి సిఎం జగన్మోహన్​ రెడ్డి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు జగన్​కు వరిపట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేద మంత్రోచ్ఛారణల నడు ఆయన దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సిఎం ఎవంట మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు మల్లాది, జోగి రమేష్​, దేవస్థానం ఛైర్మన్​ పైలా సోమినాయుడులు పాల్గొన్నారు.

ట్యాగ్స్​