ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–ఏపీ సెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ–ఏపీసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే విద్యార్థులకు ర్యాంకుల్ని కేటాయించనున్నారు. ఇప్పుడు సెకండియర్లో ఉన్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో కొవిడ్ కారణంగా పరీక్షలు పెట్టకుండా ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఈ కారణంతోనే మార్కుల వెయిటేజీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.