2వ విడత రైతు భరోసా సొమ్ము రైతు ఖాతాలకు జమ

By udayam on October 27th / 8:10 am IST

అమరావతి: ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రెండవ విడతగా 1వెయ్యి 114కోట్ల 87 లక్షల రూపాయల నగదును బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.

పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నా మని సీఎం జగన్ చెప్పారు. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశామని, ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నా మని తెలిపారు. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నామన్నారు.