రోడ్​ షో లపై ఏపీ సర్కార్​ బ్యాన్​

By udayam on January 3rd / 4:55 am IST

ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్​ షోలలో వరుసగా తొక్కిసలాటలు జరుగుతుండడంతో ఏపీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్‌ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్‌, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని సూచించింది. రాష్ట్ర, మున్సిపల్​, పంచాయితీ రాజ్​ రోడ్లపై ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు వద్దని నిర్ణయించింది. రోడ్లకు దూరంగా, మైదానాల్లో రోడ్డు షోలు నిర్వహించుకోవాలని నిర్ణయించింది.

ట్యాగ్స్​