రూ.3000 కోట్లు దాటిన ఎపి ఓవర్​ డ్రాఫ్ట్​!

By udayam on January 7th / 7:47 am IST

రాష్ట్ర ఖజానా ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక వినియోగం నమోదైంది. ఈ త్రైమాసికంలో తొలి రోజు నుంచే ఓడి లోకి వెళ్లిన ఖజానా ప్రస్తుతం 3,200 కోట్ల వరకు చేరుకుంది. ఇది వరుసగా నాలుగో రోజు కాగా, ఈ నెల్లో మూడో రోజు కావడం గమనార్హం. రెరడు రోజుల క్రితం వివిధ రూపాల్లో ఖజానాకు చేరిన నిధులు ఓవర్‌డ్రాఫ్ట్‌ కింద రిజర్వ్‌బ్యాంకు జమ చేసుకోగా, తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్​