జనవరి 15 నుంచి బందర్​ పోర్ట్​ నిర్మాణం

By udayam on December 7th / 10:54 am IST

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి ఎట్టకేలకు మహూర్తం ఖరారైంది. పోర్టు పనులను 2023 జనవరి 15న ప్రారంభించాలని ఏపీ మారిటైం బోర్డు నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి అనుమతి కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పోర్టును రూ.5,300కోట్ల వ్యయంతో మేఘా కంపెనీ నిర్మించనుంది. ఈ పోర్టు నిర్మాణానికి గతంలో 3 సార్లు టెండర్లు పిలవగా, ఏటా డ్రెడ్జింగ్ పనులపై భారీగా ఖర్చు చేయాలని ఏ సంస్థ ముందుకు రాలేదు.

ట్యాగ్స్​