ఏపీ: కొవిడ్​ మృతులకు రూ.10 కోట్ల పరిహారం విడుదల

By udayam on January 10th / 11:41 am IST

కోవిడ్‌–19తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కోవిడ్‌–19తో చాలా మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఇంకా మిగిలిపోయిన మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.10 కోట్లను విడుదల చేసింది. వీటితో దాదాపు 2 వేల మంది బాధితులకు పరిహారం అందనుంది.

ట్యాగ్స్​