గుడ్​న్యూస్​: టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ వచ్చేసింది

By udayam on October 4th / 6:53 am IST

ప్రభుత్వ పాఠశాల టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్స్, గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. తుది సీనియారిటీ జాబితాను 10న విడుదల చేయనున్నారు. గ్రేడ్‌–2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11న, స్కూల్‌ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల చేస్తారు.

ట్యాగ్స్​